పశ్చిమ బెంగాల్‌లో బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఇటీవల ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ పార్టీ బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి సైతం రణరంగంగా మారింది.
నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు వారిపై వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఈ క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపునివ్వగా అది కాస్త ఉద్రిక్తతగా మారింది. బీజేపీ నేత అర్జున్ సింగ్ కారుపై కాల్పులు జరిగినట్లు సమాచారం.మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి కార్యకర్తలతో కలసి బంద్ లో పాల్గొన్నారు.
బెంగాల్ మెడికో బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని నిరసనకారులు, వైద్యవిద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.