నర్సీపట్నంలోనూ హైడ్రా.. వైసీపీ నేత ఇల్లు కూల్చివేత..!

-

వైసీపీ పార్టీకి మరో షాక్‌ తగిలింది. నర్సీపట్నంలో హైటెన్షన్‌ నెలకొంది.. వైసీపీ నేత ఇల్లు కూల్చివేసింది చంద్రబాబు కూటమి సర్కార్‌. నర్సీపట్నం లోని శారదానగర్ లో పంట కాలువపై ఇల్లు నిర్మాణం చేస్తున్నారన్న ఆరోపణలతో వైసీపీ నేత కర్రి శ్రీను బిల్డింగ్ కూల్చివేతకు సిద్ధమయ్యారు మున్సిపల్ అధికారులు. రంగంలోకి దిగిన అధికారులు… వైసీపీ నేత ఇల్లు కూల్చి వేస్తున్నారు.

The municipal officials are ready to demolish YCP leader Karri Srinu’s building in Sharadanagar, Narsipatnam, on the allegation that a house is being constructed on a crop canal.

అయితే.. ఈ సంఘటన విషయం తెలియగానే.. రంగంలోకి దిగారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్. ఘటనా స్థలానికి చేరుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్.. అధికారులతో మాట్లాడుతున్నారు. అసలు విషయాలు తెలుసుకుంటున్నారు. చంద్రబాబు కూటమి సర్కార్‌ అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version