ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన వైసీపీ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలన్నారు మాజీ సీఎం జగన్. తాజాగా తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో బడ్జెట్ పై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను మా హయాంలోనే చక్కదిద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరి కాలంలో శ్రీలంక అయ్యే పరిస్థితి ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంపద సృస్టిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కరోనా ఉన్న మా ప్రభుత్వ హయాంలో జీడీపీ మెరుగ్గా ఉందన్నారు.
ఎవ్వరూ కుూడా చంద్రబాబు లా పెండింగ్ బకాయిలు పెట్టరు అన్నారు. కరోనా సమయంలో దేశ ఉత్పత్తిలో 4.07 శాతం వాటా ఏపీ ఉందన్నారు. సర్వసాధారణంగా కొన్ని బకాయిలుంటారు. అబద్దాలకు రెక్కలు కట్టి చంద్రబాబు వ్యవస్థీకృత నేరాలు చేశారు. ప్రతీ దానికి చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిమితికి మించి వైసీపీ అప్పులు చేసిందని అబద్దాలు చెప్పారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, పురందేశ్వరి ఆయనకు వత్తాసు పలికారు. గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్దాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.