తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని.. సరైన సమయంలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుధవారం మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది తానేనని గుర్తు చేసుకున్నారు.
53 రోజుల పాటు జైలులో ఉన్నది తానేనని.. తనని చంపాలని చూశారనే ప్రచారం కూడా జరిగిందన్నారు. తాను ఉన్న జైలు పై డ్రోన్లు కూడా ఎగురవేశారని అన్నారు చంద్రబాబు. జైలులో తన ప్రతి కదలికలను గమనించడానికి గదిలో సీసీ కెమెరాలు కూడా పెట్టారని అన్నారు. జైలులో తనకి కనీసం వేడి నీళ్లు కూడా ఇవ్వకపోగా, దోమలు కుడుతుంటే కనీసం దోమతెర కూడా లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడ్డాను అన్నారు.
కానీ తనది ఎవరిపై కక్ష తీర్చుకోవాలనే స్వభావం కాదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇక రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ను బందరు పోర్టుకు అనుసంధిస్తామని పేర్కొన్నారు. దీనివల్ల హైదరాబాద్ లోను డ్రై పోర్ట్ వస్తుందని తెలిపారు. పెరుగుతున్న నిత్యవసరాల ధరలను సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు.
అలాగే త్వరలోనే నామినేటెడ్ పదవుల రెండో విడత భర్తీ చేస్తామని అన్నారు. మరోవైపు మద్యం టెండర్లు పారదర్శకంగా జరగాలని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే నేతలను సహించబోమని హెచ్చరించారు.