తిరుమల శ్రీ వారి భక్తులకు అలర్ఠ్. అక్టోబర్ 4వ తేది నుంచి 12వ తేది వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. కాగా తిరుపతి జిల్లాలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో నేడు ప్రధాన ఘట్టం ఉంది.
చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు.. కుంకుమలు.. సారె సమర్పణ చేస్తారు. మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మ వారికి ప్రాణ ప్రతిష్ట చేశారు అమ్మవారి సేవకులు. సమగ్రరూపం దాల్చి భక్తులకు దర్శనమిచ్చారు అమ్మలగన్నమ్మ శ్రీ పోలేరమ్మ. ప్రత్యేక పూల రథంలో నడివీధి ఆలయానికి బయలుదేరారు ముగ్గురమ్మల మూలపుటమ్మ. అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా శ్రీ పోలేరమ్మ ఉత్సవ శోభాయాత్ర సాగింది. తెల్లవారుజామున నడివీధి ఆలయంలో కొలువుదీరారు అమ్మవారు.