తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం

-

8 hours time for Sarvadarshan of Tirumala Srivari:  తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 06 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 77939 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

8 hours time for Sarvadarshan of Tirumala Srivari

తిరుమల శ్రీవారికి 22668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు తిరుమల శ్రీవారి నిన్న ఒక్క రోజే హుండి ఆదాయం 3.5 కోట్లు గా నమోదు అయింది. అటు తిరుమల శ్రీ వారి భక్తులకు అలర్ఠ్‌. అక్టోబర్ 4వ తేది నుంచి 12వ తేది వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి. ఈ మేరకు అధి కారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version