తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఉంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,137 మంది భక్తులు కాగా.. 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లుగా నమోదు అయింది. కాగా, తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ వసతి గదుల టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ అక్టోబర్ నెలకు సంబంధించిన వసతి గదులు కోటాను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. తిరుమల, తిరుపతితో పాటు తలకోనకు సంబంధించిన వసతి గదులు కోటా విడుదల చేయనుంది టీటీడీ. ఈ తరుణంలో.. భక్తులు టికెట్లు అందుకోవాలని కోరింది టీటీడీ.