తిరుమల శ్రీవారి భక్తులకు ఊహించని షాక్ తగిలింది. తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షం అయింది. అర్ధరాత్రి 1 గంటా ప్రాంతంలో జింకల పార్కు వద్ద ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక గతంలో చిరుత పులి చిన్నారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శ్రీవారి జంట బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని చెప్పారు.
తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షం
అర్థ రాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద కనిపించిన ఎలుగు బంటి.#Tirumala #TirupatiBalaJi #Tirupati pic.twitter.com/sAUuOEMZgU
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2023