టాపిక్ ట్రాఫిక్  : ఏపీ ఖ‌జానాలో సొమ్ములు పోనాయా?

-

అప్పులు ఎన్ని ఉన్నా వాస్త‌విక లెక్క‌లు మాత్రం తేలాల్సిందే కానీ ఆంధ్రావ‌నిలో ఖ‌ర్చులున్నాయి కానీ సొమ్ములు మాత్రం రాబ‌డిలో లేవు. ఖ‌ర్చులు కూడాలెక్క‌లో లేవు.లెక్క‌ల్లో లేనంత కాదు బ‌డ్జెట్ లో రాయ‌ని వాటికీ బ‌డ్జెట్ అనుమ‌తి పొంద‌ని వాటికీ  డ‌బ్బు నీళ్ల‌లా ఖ‌ర్చు అయిపోతున్నాయి.దీంతో ఇప్ప‌టిదాకా దాదాపు ల‌క్ష కోట్ల రూపాయ‌ల లెక్క ఏమయిందో తెలియ‌దు. ఎందుక‌ని బ‌డ్జెట్లో లేకుండానే సంబంధిత అనుమ‌తి లేకుండా ఖ‌ర్చు చేశారో వివ‌రం ఉండ‌దు. అప్పులున్నావాటిని  తిరిగి ఇచ్చే క్ర‌మంలో కూడా  ఎక్క‌డా పార‌దర్శ‌క‌త లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేస్తున్న ఖ‌ర్చుల‌కు, తెస్తున్న అప్పులకు,పొందుతున్న రాబ‌డుల‌కూ ఎటువంటి పొంత‌న అన్న‌ది లేకుండా ఉంది.ముఖ్యంగా అప్పుల విష‌య‌మై చూపిస్తున్న జోరు త‌రువాత వాటి ఖ‌ర్చు ఏ విధంగా చేశారో అన్న‌ది పూర్తిగా వివ‌రించ‌డంలో ప్ర‌భుత్వం త‌రుచూ విఫ‌లం అవుతోంది.అప్పులు ఎన్ని ఉన్నా కూడా వాటికి అనుగుణంగా ప్ర‌భుత్వం లెక్క‌లు లేవు.ఏటా అప్పుల శాతం పెరుగుతుందే త‌ప్ప అందుకు అనుగుణంగా పోనీ పార‌ద‌ర్శ‌క రీతిలో ఖ‌ర్చుల వివ‌రాలు అయినా వెల్ల‌డిలో లేవు.బడ్జెట్ లో పొందుప‌రిచేవాటికి సంబంధించి చేయాల్సిన ఖ‌ర్చు కూడా చేయ‌డం లేద‌ని కంప్ట్రోల‌ర్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్)  చెబుతోంది.

బ‌డ్జెట్ కు సంబంధం లేకుండా 94  వేల కోట్ల‌కు  పైగా ఖ‌ర్చు చేశార‌ని తేలిపోయింది. అంటే ఈ మొత్తం వేటికి ఖ‌ర్చు చేశార‌ని.. ఏ ప‌థ‌కాల‌కు వెచ్చించార‌ని బ‌డ్జెట్ లో లేకుండా ఖర్చు చేసిన మొత్తాల‌కు ప‌ద్దులో లెక్క ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం ఓ విధంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మే!  ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న ఆర్థిక సంవ‌త్సరంలో తొమ్మిది నెల‌ల‌కు సంబంధించి తేలిన లెక్క ఇది. ఇక బ‌డ్జెట్ కేటాయింపుల‌కు మించి ఖ‌ర్చు చేసిన వ్య‌యం 13 వేల కోట్ల‌కు పైగానే ఉంద‌ని తేలింది. ముఖ్యంగా అప్పులు తీసుకోవ‌డంలోనూ చెల్లించ‌డంలోనూ  పార‌దర్శ‌క‌త లేద‌ని తేలిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version