తుని మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా

-

కాకినాడ జిల్లాకు చెందిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇటీవలే 4 సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కోరం లేక వాయిదా పడుతూ వచ్చింది. మరోసారి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని సన్నాహాలు చేస్తుండగా.. రాజకీయ సమీకరణాలు అంతా ఒక్కసారిగా మారిపోయాయి. చైర్ పర్సన్ పదవీకి సుధారాణి తాజాగా రాజీనామా చేశారు.

తాను కౌన్సిలర్ గా కొనసాగుతానని.. కానీ తనతో సహా 15 మంది కౌన్సిలర్లు వైసీపీలోనే ఉంటారని ఆమె చెప్పారు. వీరిలో కొందరూ టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. తుని మున్సిపాలిటీలో ప్రస్తుతం 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్ పర్సన్ రాజీనామా చేయడంతో ఇప్పుడు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం కూటమి ప్రభుత్వానికి కష్టమనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version