పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో అప్డేట్స్ తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఘటనా స్థలం వరకు మొత్తం 15 గంటల సీసీ కెమెరా ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రవీణ్ పగడాల మృతి చెందిన స్పాట్ లో పలు ఆధారాలు సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు.
హైదరాబాద్ లో ఉన్న ప్రవీణ్ కుటుంబ సభ్యులను విచారించి వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు ఏపీ పోలీసులు. ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్ ఈరోజు సాయంత్రం లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. అటు . పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెలుగులోకి మరో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై గన్నవరం సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ నెల 24వ తేదీ రాత్రి 9 గంటలకు గన్నవరం దాటారు పాస్టర్ ప్రవీణ్.