BREAKING : వినియోగదారులకు అలర్ట్..ట్విట్టర్ డౌన్ !

-

BREAKING : వినియోగదారులకు అలర్ట్..ట్విట్టర్ డౌన్ అయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ట్విట్ట‌ర్ Twitter యూజ‌ర్లు సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో కొత్త అప్డేట్స్‌.. రావడం లేదు. గత 3 గంటలుగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు.

Twitter

కొంద‌రు ట్విట్ట‌ర్‌లోకి లాగిన్ అవ‌లేక‌పోతున్నామ‌ని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక కొంద‌రికి ప్రొఫైల్ యాక్సెస్ అవ‌డం లేద‌ని, కొంద‌రికి టైమ్ లైన్ ఫీచ‌ర్ రావ‌డం లేద‌ని అంటున్నారు. ఇక కొందరు కేవ‌లం ఫోన్ల‌లోనే ట్విట్ట‌ర్ వ‌స్తుంద‌ని, కంప్యూట‌ర్ల‌లో రావ‌డం లేద‌ని ఫిర్యాదులు చేస్తున్నారు. మరి దీనిపై ట్విట్టర్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version