ఒకే దెబ్బకు రెండు పిట్టలు..కల్యాణ్-కేటీఆర్ కాంబో!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి…అసలు ఎవరు ఎప్పుడు ప్రత్యర్ధులుగా మారుతున్నారో, మిత్రులుగా మారుతున్నారో అర్ధం కాకుండా ఉంది. తాజాగా బీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో ఊహించని పరిణామం ఎదురైంది…అవ్వడానికి సినిమా ఫంక్షన్ అయినా సరే..ఇది పూర్తిగా రాజకీయంగా కౌంటర్లు ఇవ్వడానికే అన్నట్లు పరిస్తితి ఉంది.

ఎందుకంటే సినిమా ఈవెంట్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు వచ్చారు…అయితే సినిమా నిర్మాతలు పిలిస్తే కేటీఆర్ రాలేదు..కేవలం పవన్ కల్యాణ్ స్వయంగా ఆహ్వానిస్తేనే కేటీఆర్, తలసానిలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. అయితే కావాలనే పవన్..కేటీఆర్‌ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలనే చెప్పి పవన్ ఇలా చేశారని అర్ధమవుతుంది.

ఎందుకంటే ఇటీవల సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో సినిమా వల్ల పెద్ద చర్చ నడిచిన విషయం తెలిసిందే..ఆఖరికి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వారు స్వయంగా జగన్‌ని కలిసి మాట్లాడారు. చిరంజీవి లాంటి వారు జగన్‌ని ఆదుకోవాలని వేడుకున్నారు. ఇక ఇలా చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలని చెప్పి..తెలంగాణ మంత్రులని ఆహ్వానించారు..అలాగే తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందులు లేవు..కేవలం ఏపీ ప్రభుత్వమే ఇబ్బందులు పెడుతుందనే కోణాన్ని హైలైట్ చేశారు.

అదే సమయంలో పవన్ ఫంక్షన్‌కు కేటీఆర్ వచ్చి..పరోక్షంగా తెలంగాణలోని బీజేపీకి కౌంటర్ ఇచ్చారు..ఎందుకంటే బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుని ఉన్నారు..అలాంటప్పుడు పవన్..టీఆర్ఎస్ నేతలతో క్లోజ్‌గా ఉన్నారు..అలాగే కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇలా పవన్ టీఆర్ఎస్‌కు అనుకూలంగా మాట్లాడటంతో బీజేపీ చిక్కుల్లో పడినట్లు అయింది..అంటే పవన్ ఏమో కేటీఆర్‌ని ఆహ్వానించి…ఏపీలోని జగన్ ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వగా, ఫంక్షన్‌కు వచ్చి కేటీఆర్..పరోక్షంగా బీజేపీకి కౌంటర్ ఇచ్చినట్లు అయింది. అంటే పవన్ కల్యాణ్-కేటీఆర్ కాంబోతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పరిస్తితి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version