తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటనకు మరోసారి వెళ్లనున్నారు. గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల కింద మహారాష్ట్ర వెళ్లి… ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లాంటి కీలక నేతలను కలిశారు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ కు మాజీ ప్రధాని దేవెగౌడ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి నేతల మద్దతు కూడా వచ్చింది. ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్ ఇదే విషయంపై ఇవాళదేశ రాజధాని ఢిల్లీ వెళ్లాలని అనుకున్నారు.
కానీ.. కొన్ని అనివార్య కారణాలు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఓ పెనింగ్ ఉండటం కారణంగా… పర్యటన రద్దు అయింది. అయితే.. రేపు ఉదయం సీఎం కేసీఆర్ ఢీల్లీ వెళ్లనున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. రేపటి ఢిల్లీ పర్యటనలో… సీఎం కేసీఆర్ తో పాటు… కేకే, వినోద్ కుమార్, సంతో ష్ కుమార్‌కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.