BREAKING : ఏపీలో రెండు చిరుతలు మృతి చెందాయి. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు చిరుతల మృతి కలకలం రేపుతున్నాయి. మడకశిర మండలం మెలవాయి గ్రామ సమీపంలో ఇవాళ మరో చిరుత మృతి చెందగా, నిన్న కూడా ఒక చిరుత మృతదేహాన్ని గుర్తించారు అటవీశాఖ సిబ్బంది.
వరుసగా చిరుత పులుల మృతదేహాలు బయటపడటంతో ఉలిక్కిపడుతున్నారు ఫారెస్ట్ అధికారులు. చిరుతల మృతదేహాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి అటవీశాఖ అధికారుల బృందం రానుంది.కాగా, తిరుమలలో మరో చిరుత కలకలం రేపింది. తాజాగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో చిరుత బోనులో చిక్కింది.
మూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలోనే చిరుత బోనులో చిక్కింది.ఇక ఆ చిరుతను బంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్ష్మినరశింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ తరుణంలోనే.. .లక్ష్మి నరశింహస్వామి ఆలయం వద్దే బోనులో చిక్కింది మరో చిరుత.