షర్మిల కాంగ్రెస్‌ లోకి వస్తే బాగుంటుంది – ఉండవల్లి సంచలనం

-

షర్మిల కాంగ్రెస్‌ లోకి వస్తే బాగుంటుందని తెలిపారు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. తాజాగా పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలో చేసిన వారాహి యాత్ర గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈయన మాట్లాడుతూ మొన్ననే పవన్ చేసిన వారాహి యాత్ర ప్రజలలో మంచిగా దూసుకువెళ్లింది అన్నారు. పవన్ చేసిన ఈ యాత్ర సక్సెస్ అయిందని కంఫర్మ్ చేశాడు.

తాను ఏమి చేస్తాడు అన్న విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పాడని పవన్ ను ఉద్దేశించి అన్నాడు ఉండవల్లి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అన్న విషయం తెలియదు అన్నారు. అలాగే, కాంగ్రెస్ మరింత బలపడుతుందని… షర్మిల వస్తే కాంగ్రెస్ కు బానే ఉంటుందని వివరించారు. బెంగుళూరులో ప్రతిపక్షాల సమావేశం వల్ల ప్రయోజనం ఉంటుందని.. కాంగ్రెస్‌కు బెంగుళూరుతో సెంటిమెంట్ ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల పై ఇప్పుడే చెప్పలేమని.. బీజేపీ నిర్ణయాలను అంచనా వేయలేమని వెల్లడించారు. పురంధరేశ్వరి స్వతహాగా మంచి స్వభావంతో ఉండే వ్యక్తి అని… మార్పు మంచికే అని భావిస్తున్నా..దేశంలో విద్వేషం పెరుగుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version