ఏపీ ఉద్యోగులకు బిగ్ షాక్… మళ్ళీ తెరపైకి ఆ పెన్షన్ ?

-

ఏపీ ఉద్యోగులకు బిగ్ షాక్. మళ్ళీ తెరపైకి కొత్త పెన్షన్ వచ్చింది. దింతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. గత వైయస్సార్సిపి ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో తీసుకొచ్చిన గ్యారెంటీ పెన్షన్ పథకం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా జిపిఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెబుతోంది. అయితే ఈ జిపిఎస్ కు సంబంధించిన ఫైల్ పై గత నెల 12న అప్పటి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ ఫైల్స్ పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్ లో జిపిఎస్ కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట. ఈ జిపిఎస్ కు సంబంధించి జూన్ 12న జీవో 54 ను విడుదల చేయగా…పాత ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ శుక్రవారం గెజిట్ లో అప్లోడ్ చేయడంతో ఆందోళన మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version