తిరుపతిలో అపచారం జరిగింది. తిరుపతి లో ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టాడు ఓ అజ్ఙాత వ్యక్తి. అయితే… తిరుపతి లో ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టడంతో… హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం కావాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని ఖండించారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి. నిందితులను కఠినంగా శిక్షించాలి…. సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ స్వామి ఇప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు. 32 వేల సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ.. బయటికి వచ్చిన సీసీ ఫుటేజ్
విగ్రహానికి ఓ దుండగుడు శాంతాక్లాజ్ టోపీ తొడుగుతున్నట్టు వీడియోలో రికార్డు https://t.co/8s4b7qqtVy pic.twitter.com/Fzfodz0F0R
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2024