వంగవీటి రాధా చేసుకోబోయే అమ్మాయి ఈమెనే

-

 

 

 

ఏపీ రాజకీయాలలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వంగవీటి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ ఏపీ రాజకీయాలను వంగవీటి కుటుంబం ప్రభావం చేస్తూనే ఉంది. అయితే అలాంటి వంగవీటి కుటుంబంలో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. వంగవీటి వారసుడు రాధాకృష్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వంగవీటి రాధాకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు.

నరసాపురం పట్టణానికి చెందిన ఓ యువతీతో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది. నరసాపురం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీనే వంగవీటి రాధా పెళ్లి చేసుకోనున్నారు. తన మిత్రుడికి మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జి దగ్గర బంధువులేనట ఇక ఈనెల 19వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే నరసాపురం లో ఎంగేజ్మెంట్…జరుగనుంది. సెప్టెంబర్ 6న వంగవీటి రాధా పెళ్లి నిశ్చయమైంది. ఇక ఈ విషయం బయటకు రావడంతో వంగవీటి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version