టీడీపీ హయాంలో 169 శాతం అప్పు పెరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రెండు రోజులుగా ఏపీ అప్పులపై వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య చర్చ జరుగుతోంది. అయితే.. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ అప్పు 169 శాతం పెరిగిందని ఫైర్ అయ్యారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పులు 55 శాతానికి తగ్గాయని వివరించారు. కార్పొరేట్ల ప్రయోజనాలకే ఖజానాలో సొమ్మును టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. పేద ప్రజల కలల నెరవేర్చేందుకు సీఎం జగన్ పెట్టుబడి పెడుతున్నారని చెప్పారు. టీడీపీకి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనని వివరించారు విజయసాయి రెడ్డి.
కాగా,ఏపీ సహా ఆరు రాష్ట్రాలు అదనపు రుణం పొందేందుకు అవకాశం కల్పించింది ఆర్‌బీఐ.విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకుగాను అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. విద్యుత్ సంస్కరణల్లో ప్రధానంగా.. 3 అంశాలను అమల్లోకి తీసుకువచ్చినందుకుగాను.. కేంద్రం ఈ అవకాశం కల్పించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో..12 రాష్ట్రాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా…తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సహా..ఆరు రాష్ట్రాలకు ఈ అవకాశం దక్కింది.