ట్రంప్ కు వివేక్ రామస్వామి మద్దతు.. కొలరాడో బరి నుంచి తప్పుకుంటానని ప్రకటన

-

రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనర్హుడు అంటూ కొలరాడో సుప్రీం కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అదే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న వివేక్‌ రామస్వామి స్పందించారు. కొలరాడో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్నకు ఆయన తన మద్దతు ప్రకటించారు. కొలరాడో బ్యాలెట్‌లో ట్రంప్‌ పేరు చేర్చకుంటే తాను కూడా అక్కడి ప్రైమరీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.

అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడి కేసులో ట్రంప్‌ ప్రమేయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడంటూ కొలరాడో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత వివేక్‌ రామస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. కొలరాడో బ్యాలెట్‌లో ట్రంప్‌ పేరును తిరిగి చేర్చేందుకు కోర్టు అనుమతివ్వకుంటే ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మిగతా అభ్యర్థులకు వివేక్‌ రామస్వామి సూచించారు. వారు ఇంకా వివేక్ అభ్యర్థనపై స్పందించకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version