తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి..పార్టీలు మారడం ఒక లెక్కా – సాయిరెడ్డి

-

తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి.. పార్టీలు మారడం ఒక లెక్కా అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉందని ఫైర్‌ అయ్యారు. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా అంటూ నిలదీశారు.

vijayasai reddy and purandeswari

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారిందని మండిపడ్డారు. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోంది. ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారని చురకలు అంటించారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి. ఇప్పుడు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం అని ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version