చంద్రబాబుకు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు – విజయసాయి ట్వీట్‌

-

చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు మారిందని వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సీరియస్‌ అయ్యారు. అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.

vijayasai reddy comments on chandrababu naidu

ప్రాజెక్టు నిధులను దారిమళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టిస్తున్నాడని తెలిపారు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాగు, సాగు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని వివరించారు వైసీపీ పార్టీ రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు దుర్భుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version