సంగారెడ్డిలో దారుణం..ఇన్‌ స్టాలో పరిచయం..ఆ తర్వాత పొదల్లో అత్యాచారం !

-

సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది..ఇన్‌ స్టాలో పరిచయం అయిన తర్వాత ఓ బాలికపై పొదల్లో అత్యాచారం చేశాడు దుర్మార్గుడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో దారుణం చోటు చేసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమై ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) జివంగి గ్రామానికి చెందిన చెందిన వినీల్ (19), న్యాల్కల్ కి చెందిన ఓ బాలిక(16) ఒకరికొకరు ఇన్ స్టాలో పరిచయమయ్యారు.

A minor girl was raed in the name of love after meeting her on Instagram

ఈ తరుణంలోనే… ఏడు నెలలుగా ప్రేమ పేరుతో ఇన్ స్టాలో బాలికతో చాటింగ్, కాల్స్ చేస్తున్నాడు వినీల్ (19). ఇక ఇటీవల బాలిక గ్రామానికి వచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు యువకుడు. అయితే… పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి ఈ విషయం రావడం జరిగింది. దీంతో యువకున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన హాద్నూర్ పోలీసులు.. విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version