ప్రజాస్వామ్యంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌

-

ప్రజాస్వామ్యంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌ చేశారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 నుంచీ దేశంలో అమలవుతున్నది ప్రాతినిధ్య (పార్లమెంటరీ) ప్రజాస్వామ్యమా? లేక ఎన్నికల (ఎలక్టరల్‌) ప్రజాస్వామ్యామా? అనే చర్చ ఈ మధ్య మీడియాలో, యూనివర్సిటీలు వంటి ఉన్నత విద్యాసంస్థల్లో మొదలైంది. ప్రజాసంక్షేమం కోరుకునే పబ్లిక్‌ ఇంటెలెక్చ్యువల్స్‌ ఇండియాలో ప్రజాతంత్ర వ్యవస్థ నాణ్యతపై తర్జనభర్జలు పడుతున్నారు. వాస్తవానికి నిర్ణీత సమయంలో ఎప్పటికప్పుడు ఎన్నికలు లేకుండా ఏ ప్రజాస్వామ్యమైనా మనజాలదు. అలా అని కేవలం ఎన్నికల నిర్వహణతోనే ప్రభుత్వాధినేతల నియామకంతో ప్రజాస్వామ్య ప్రక్రియ పూర్తికాదు. భారతదేశంలో గత 71 ఏళ్లుగా నడుస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాణాలు నచ్చని విద్యావేత్తలు, బుద్ధిజీవులు కొందరు మారుతున్న పరిస్థితులపై అసంతృప్తిచెందుతున్నారన్నారు విజయసాయిరెడ్డి.

నిరాశానిస్పృహలు వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో వారు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పలచనచేసి మాట్లాడడం దురదృష్టకరం. ఎందుకంటే, ఉన్నంతలో సాఫీగా జరుగుతున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ద్వారానే కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి లేదా తిరిగి ఎన్నికై అధికారంలో కొనసాగుతున్నాయి. 1952 నుంచి 1971 వరకూ వరుసగా జరిగిన ఐదు పార్లమెంటు ఎన్నికల్లో ఒకే పార్టీ (భారత జాతీయ కాంగ్రెస్‌) గెలిచిన మాట నిజమే. అయితే, మొదటి సాధారణ ఎన్నికల నుంచి పాతికేళ్ల తర్వాత జరిగిన లోక్‌ సభ ఎన్నికల ద్వారానే 1977లో కేంద్రంలో మొదటిసారి కొత్త పార్టీ (జనతా పార్టీ) అధికారంలోకి వచ్చింది. శాంతియుతంగానే రెండు జాతీయపక్షాల మధ్య అధికార బదిలీ జరిగింది. ఇదే తరహాలో 1980, తర్వాత 1989, 1991, 1996, 1998లో నాటి పాలకపక్షాలు ఓడిపోయాయి. ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చాయి. అనంతరం 1999 సెప్టెంబర్‌–అక్టోబర్‌ మాసాల్లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో మాత్రం నాటి ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ (ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి) బలం కొద్దిగా పెంచుకుని మరోసారి అధికారంలోకి వచ్చిందన్నారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version