గత రెండు రోజుల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని న్జక్తుల కోసం కొన్ని మార్పులు చేస్తున్నాం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్.. జి.సృజన తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనేదే మా ఉద్ధేశం. వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలని కోరుతున్నాం. ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. రేపట్నుంచి రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశాం అన్నారు.
అలాగే దుర్గగుడి ఈవో.. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. తొలిరోజు అమ్మవారిని 49 వేల మంది దర్శించుకున్నారు. రెండవ రోజు అమ్మవారిని 65 వేల మంది దర్శించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకూ 36 వేల మంది దర్శించుకున్నారు. మూలానక్షత్రం రోజు భారీగా భక్తులు తరలివస్తారు. ఇక ఈ రెండు రోజుల్లో 28 వేల మంది అన్నదానంలో అన్నప్రసాదం స్వీకరించారు. 3,952 మంది కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించారు. లక్షా 39,906 లడ్డూలు కొనుగోలు చేశారు . లక్షన్నరకు పైగా లడ్డూలు రెడీగా ఉన్నాయి. 6 లడ్డూలు కలిపి ఒక ప్యాకింగ్ రూపంలో అందిస్తున్నాం. లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చూస్తున్నాం అని తెలిపారు.