మీ రిలేషన్ ఇలా ఉందా..? అయితే మీరిద్దరూ సంతోషంగా లేరని అర్ధం..!

-

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొంతమంది రిలేషన్ లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మీ దాంపత్య జీవితం సరిగా లేదని ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇలాంటివి కనుక మీ దాంపత్య జీవితంలో ఉన్నట్లయితే మీ మధ్య ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. మీ దాంపత్య జీవితం బాలేదని చెప్పే సంకేతాలు అయితే ఇవే. పెళ్లి అయిన తర్వాత వైవాహిక జీవితంలో గొడవలు వస్తూ ఉంటాయి. గొడవలు తీవ్రత పెరిగితే రిలేషన్షిప్ దెబ్బతిందని అర్థం చేసుకోవాలి, అలాగే వైవాహిక జీవితంలో ముఖ్యమైన అంశం గౌరవం.

ఒకరినొకరు గౌరవించకపోయినా, నలుగురిలో హేళన చేస్తున్న గౌరవం ఇవ్వకపోతున్నా మీ రిలేషన్షిప్ దెబ్బతింటుంది. రిలేషన్షిప్ దెబ్బ తినడానికి మరో కారణం అనుమానం. ఇద్దరూ నిజాయితీగా మెలగాలి. ప్రతి అంశంలో ఓపెన్ గా ఉంటే అనుమానానికి తావు ఉండదు. అలాగే ప్రతిసారి నియంత్రణలో ఉండాలి ఆరోగ్యకరమైన రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఒకరినొకరు నియంత్రించుకోరు.

నిత్యం ఫ్రీగానే ఉంటారు. అలాగే విశ్వాసం కోల్పోవడం వలన కూడా రిలేషన్షిప్ సరిగ్గా లేదని అర్థం చేసుకోవచ్చు. అలాగే దుర్భాషలడడం కూడా రిలేషన్షిప్ సరిగ్గా లేదని సూచిస్తుంది. సంజాయిషీ చెప్పడం కూడా పార్ట్నర్ మధ్య ప్రేమ తగ్గిందని రిలేషన్షిప్ దెబ్బతిన్నని అర్థం చేసుకోవాలి. ఇలాంటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పార్ట్నర్ ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version