రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు !

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి. తిరుమలలో రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవ, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టిటిడి పాలక మండలి.

VIP break darshans in Tirumala canceled tomorrow

ఇక అటు ఇవాళ నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఇక 66, 561 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 18, 647 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతేకాదు… హుండీ ఆదాయం 3.98 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో స్థానిక దర్శనాలు ఉంటాయి. ప్రతీ మంగళవారం రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో స్థానిక దర్శనాలు ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version