నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ…!

-

నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఇక అత్యాధునిక హంగులతో ఎయిర్‌ పోర్టును తలపించే విధంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్దం చేశారు. రూ. 430 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంది కొత్త టెర్మినల్. 9 ప్లాట్ ఫామ్ లు, 9 లిఫ్టులు, 5 ఎస్కలెటర్లు , 2 విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో ఏర్పాటైంది చర్లపల్లి టెర్మినల్.

PM Modi to Virtually Unveil Telangana’s New Cherlapally Railway Terminal Today

హైదరాబాద్ లో పాత రైల్వే స్టేషన్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా చర్లపల్లి స్టేషన్‌ ను కట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రారంభానికి ముందే చర్లపల్లి టెర్మినల్ నుంచి మొదలయ్యాయి టికెట్ బుకింగ్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 18 వరకు నడవనున్నాయి ప్రత్యేక రైళ్లు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ఆర్టీసీ , ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులో ఉంచుతామంటున్నారు రైల్వే అధికారులు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో 26 ట్రైన్ల ఆపరేషన్ ఉంటుంది. భవిష్యత్తులో 30 పైగా ట్రైన్లు టెర్మినల్ నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version