మూలపేట పోర్టులో కీలక పరిణామాలు..!

-

మూలపేట పోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ అండ్ మేనేజ్మెెంట్ బాధ్యతలను విశాఖ పోర్టు ట్రస్ట్ అథార్టీకి అప్పచెప్పే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇతర రాష్ట్రాల్లోని పోర్టుల్లో ఆపరేషన్ అండ్ మేనేజ్మెెంట్ ఎలా ఉందోనని అధ్యయనం చేయనుంది ప్రభుత్వం. అయితేమూలపేట పోర్టులో పెట్టుబడులకూ ముందుకు వచ్చింది విశాఖ పోర్టు ట్రస్ట్ అథార్టీ.

49 శాతం వాటాతో పెట్టుబడులు పెట్టేందుకు విశాఖ పోర్టు ట్రస్ట్ ఆసక్తి చూపిస్తుంది. కానీ మూలపేట పోర్టులో విశాఖ పోర్టు అథార్టీ పెట్టుబడులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే.. ల్యాండ్ లార్డ్ ప్రాతిపదికన ఇప్పటికే మూలపేట పనులను ప్రారంభించింది ప్రభుత్వం. ల్యాండ్ లార్డ్ ప్రాతిపదికన 25.75 శాతం మేర పోర్టు పనులు పూర్తి అయ్యాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖ పోర్టు ట్రస్టు పెట్టుబడులను స్వీకరించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అయితే విశాఖ పోర్టుకు శాటిలైట్ పోర్టుగా మూలపేట పోర్టును వినియోగించుకోవాలని భావించింది విశాఖ పోర్టు ట్రస్ట్ అథార్టీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version