రూ.1.64 లక్షల కోట్ల పెన్షన్లు ఇవ్వబోతున్నాం – సీఎం చంద్రబాబు

-

రూ.1.64 లక్షల కోట్ల పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ లో చంద్రబాబు మాట్లాడుతూ… ఐదేళ్లల్లో రూ. 1.64 లక్షల కోట్ల మేర పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. పేదల సేవలో అనే కార్యక్రమం కింద కలెక్టర్లు, అధికారులు పేదలతో మమేకం కావాలని కోరారు సీఎం చంద్రబాబు నాయుడు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని… 1995 సీఎంని చూస్తారని హెచ్చరించారు.

We are going to give Rs.1.64 lakh crore pensions said CM Chandrababu

అంగన్వాడీలకు పోతా.. డ్రైన్లను పరిశీలిస్తానని.. డ్రైన్లల్లోకి ఐఏఎస్సులను కూడా దింపానన్నారు. డ్రైన్ల పరిస్థితి చూడండి అని అధికారులను పంపానని… పని చేసే బాధ్యత అధికారులది.. పని చేయించే బాధ్యత మాదని వివరించారు. దీన్ని అధికారులందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ప్రజలు మాకు అద్భుతమైన విజయం అందించారని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు.. ఎన్నో అవమానాలను.. ఆంక్షలను ఎదుర్కొని కష్టపడి అధికారంలోకి వచ్చామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version