ఆగస్టు 15న అన్న క్యాంటీన్ల ప్రారంభం – చంద్రబాబు ప్రకటన

-

సూపర్-6కు కట్టుబడి ఉన్నామని… ఆగస్టు-15వ తేదీన అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు.ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తామన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ఐఏఎస్సులుగా ఉన్న వాళ్లకి కలెక్టర్లుగా చేయడం ఓ కల అన్నారు. పని చేయకుంటే గ్యారెంటీ లేదని వివరించారు. ప్రజల కోసం పని చేయాలనుకుంటే కలెక్టర్లకే చాలా చక్కటి అవకాశం అన్నారు.

We are setting up canteens on August-15th

బెస్ట్ కలెక్టర్ అనిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని… విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్ల పాలనలో ఏపీకి జరిగిందన్నారు చంద్రబాబు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 50 శాతం ఫిర్యాదులు భూ సమస్యలే ఉన్నాయన్నారు. రీ-సర్వేను హోల్డులో పెట్టామని.. సర్వే రాళ్లను గెలాక్సీ గ్రానైట్ రాళ్లతో వేశారని పేర్కొన్నారు. తన ఫొటో వేసుకోవడం కోసం గెలాక్సీ గ్రానైట్ రాళ్లు వేశారని… ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. సంపద సృష్టికి కొత్త విధానాలు అవలంభించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version