పిల్లల భవిష్యత్ కోసం కలిసే ఉంటామని టెక్కలీ ZPTC దువ్వాడ వాణీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది కాలం నుంచి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యం. పిల్లల భవిష్యత్ కోసం కలిసి ఉండటానికైనా సిద్దమే అని తెలిపింది.
పిల్లలకోసం దిగి వచ్చింది దువ్వాడ వాణి. తాను నాకు ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేదు. నేను తనకు ఇవ్వను. కానీ పిల్లలు మాకు ముఖ్యం. ఆయన ఎక్కడ ఉన్నా.. ఎవ్వరితో ఉన్నా నాకు అనవసరం. కానీ పిల్లలను చూసుకోవాలి. ఇద్దరం చూసుకుంటాం. మరోవైపు కొత్తగా నిర్మించిన ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఉంటున్నారని మా ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్న తమ తండ్రి మాతో రావాలని ఆయన కుమార్తెలు వేడుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉండటానికి లిఖిత పూర్వక హామీ ఇస్తే చాలు అని వాణి పేర్కొంది.