ఏపీకి మరో ముప్పు వచ్చి పడింది. తాజాగా ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈనెల 9న నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి దగ్గర అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. అనంతరం 48 గంటల్లో అది బలపడే అవకాశం ఉందని ఐఎండి శనివారం తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి అల్పపీడనం ఇదేనంటుంది.
ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా తమిళనాడు పై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ పైన కొద్దిగా ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మీదుగా దిగువ నుంచి తూర్పు గాలులు వీస్తున్నాయి. రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.