హైదరాబాద్ నగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో హల్చల్ చేస్తున్నాయి అంతర్రాష్ట్ర ముఠాలు. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్ లో గోల్డ్ షాప్ లో రాబరికి యత్నించారు. వనస్థలిపురం లో బ్యాంకు నంచి డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తి నుండి 15లక్షల నగదు, బంగారం కాజేసింది ముఠా. బ్యాంకు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి నిందితుల కదలికలు. అటు కారులో డబ్బులు బ్యాగు లాక్కొని బైక్ పై పరారయ్యారు ఇద్దరు దుండగులు.
నిన్న మేడ్చల్ లో పట్టపగలే గోల్డ్ షాపులో జొరబడి దోపిడీకి యత్నించారు. యజమానిపై కత్తితో దాడిచేసి బైక్ పై పరారయ్యారు ఇద్దరు దుండగులు. దీనికి సంబంధించిన దృష్యాలు సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇప్పటి వరకు దొరకలేదు దోపిడీ ముఠాల ఆచూకీ. హైదరాబాద్ నగరంలో వరుస చోరీలతో హల్చల్ చేస్తోంది ధార్ గ్యాంగ్. హయత్ నగర్ ప్రజయ్ గుల్మహర్ గేటెట్ కమ్యూనిటీలో ఆరు ఇండ్లలో వరుస చోరీలు జరిగాయి.
పటాన్ చెర్వు రుద్రారంలో ఇండ్లలో దొంగల వరుస చోరీలు కూడా చోటు చేసుకున్నాయి. ఉప్పల్ చిలుకా నగర్ లో వృద్ద దంపతులను బందించి దోపిడీ యత్నం చేసింది ముఠా. అయితే.. ఇంత జరుగుతున్నా.. తెలంగాణ హొం మంత్రి స్పందించడం లేదు. వాస్తవానికి తెలంగాణ హొం మంత్రి ఎవరు అనే విషయం ఎవరికీ తెలియదు. ఆ శాఖ రేవంత్ దగ్గరే ఉంది. ఈ సంఘటనలపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఫైర్ అవుతున్నారు.