మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి వైసీపీ నేత విద్యాసాగర్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృస్టించిన ముంబయి నటి కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను గుంటూరు సీఐడీ ప్రాంతాయ కార్యాలయానికి తరలించారు. తన పై అక్రమంగా కేసు నమోదు చేశారని.. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఇబ్రాహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విధితమే. 

అయితే ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తాజాగా విజయవాడ సీఐడీ కోర్టు మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో విచారణ కోసం కుక్కల విద్యా సాగర్ ను గుంటూరు తీసుకొచ్చారు పోలీసులు. తొలుత జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ఆ తరువాత సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే మూడు రోజుల పాటు విద్యా సాగర్ ను విచారించనున్నారు సీఐడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version