Telangana: 3,94,232 మంది రైతులకు రైతుబంధు కట్‌ !

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్‌ షాక్‌ తగిలినట్లు సమాచారం అందుతోంది. 3,94,232 మంది రైతులకు రైతుబంధు కోత పెట్టినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎకరం వరకు ఉన్న రైతులకు గత వానాకాలంలో బీఅర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వారికంటే 3,94,232 మంది రైతులకు కోత పెట్టినట్టు అంగీకరించిన వ్యవసాయ శాఖ.. ఈ మేరకు నిధులు విడుదల చేసిందట.

There is news about the Congress government that Rythu Bandhu cut 3,94,232 farmers

గత వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం వరకు 22,55,181 మంది రైతులకు చెందిన 12,85,147 ఎకరాలకు రూ.642.57 కోట్ల రైతుబంధు ఇచ్చిందని చెబుతున్నాయి లెక్కలు. ఈ యాసంగిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరం వరకు కేవలం 18,60,949 మంది రైతులకు చెందిన 12,21,820 ఎకరాలకు రూ.610.91 కోట్ల రైతుబంధు మాత్రమే ఇచ్చింది అని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మరి దీనిపై ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

https://twitter.com/TeluguScribe/status/1888096311968252094

Read more RELATED
Recommended to you

Exit mobile version