ఏపీలో కలకలం రేపింది. వైసీపీ MLC సిపాయి కిడ్నాప్ అయ్యాడని అంటున్నారు. వైసీపీ MLC సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ కిడ్నాప్ చేసినట్లు ఆ పార్టీ ఆరోపిస్తుంది. అర్ధరాత్రి తర్వాత ఆయనను నివాసం నుంచి తీసుకెళ్లినట్లు చెబుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా.. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిపాయిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కాగా అటు తిరుపతి రాయల్ చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున వైసిపి కార్యకర్త కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ లపై దాడి జరిగింది. ఈ సంఘటనలో రెండు కార్లను ధ్వంసం చేశారు. టిడిపి నేతలు మాదాడి చేశారంటూ వైసిపి కార్యకర్తలు నిరసనకు దిగారు. టిడిపి నేత మబ్బుదేవనారాయణ ఇంటి వద్ద వెళ్ళిన సమయంలో గోడవ పడ్డారు. పోలీసులు రాకతో గోడవ సద్దుమణిగింది.