సాక్షి దినపత్రికను కొనడానికి రూ.2400 కోట్లు – వైసీపీ ఎంపీ

-

 

సాక్షి దినపత్రికను కొలుగోలు చేయడానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వాలంటీర్లకు 200 రూపాయల చొప్పున సంవత్సరానికి 2400 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. పత్రిక కొనుగోళ్ల పేరిటనే ఐదేళ్లలో 12 వేల కోట్ల రూపాయలను దోచేశారని, వాలంటీర్లు ప్రజాసేవ చేస్తున్నారని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మరి గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పంపిణీ చేయడం ప్రజాసేవ కాదా? అంటూ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

జగనన్న పింఛన్ ఇచ్చాడని, రేషన్ బియ్యం ఇచ్చాడని చెప్పడానికి నియమించిన వాలంటీర్ల పేరిట పేపర్ కొనుగోళ్ల కోసం 12 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టగా లేనిది, ఐదేళ్లలో ఉచిత ఇసుక పంపిణీ వల్ల మూడు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేయగానే, జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలతో రఘురామిరెడ్డి కేసు నమోదు చేశారన్నారు.

ఈ ప్రభుత్వం మారాక, సాక్షి దినపత్రిక కొనుగోలు కోసం వాలంటీర్లకు 12 వేల కోట్ల రూపాయలను వెచ్చించారని, ఇతర ఏ పత్రికలను కొనుగోలు చేయలేదని కేసు పెడతారన్నారు. వాలంటీర్ల పేరిట నీ పార్టీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని కేటాయించడం ఎంత వరకు సమంజసం అని, వాలంటీర్లు ఎవరు అంటే మన పార్టీ కార్యకర్తలని మంత్రులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగులు భద్రంగా ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం కంటే వేగంగా అప్పుడు చర్యలు ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version