ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. డీలిమిటేషన్పై ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ రాయడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని ఈ సందర్భంగా కోరారు జగన్.. 2026లో జరిగే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందని వెల్లడించారు. ఎంపీ సీట్లు తగ్గుతాయని దక్షిణాదిలో చర్చ జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు.
గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని వివరించారు. గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రంణ పిలుపు వల్లే తగ్గిందన్నారు. ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గుతాయని వివరించారు. డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలన్నారు వైఎస్ జగన్.