ఇవాళ ఉదయం 11 గంటలకు జగన్ ప్రెస్‌ మీట్‌ !

-

వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ మీడియా సమావేశం ఉంటుంది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో తాజా పరిణామాలు, పరిస్థితులపై మాట్లాడనున్నారు జగన్ మోహన్‌ రెడ్డి.

YS Jagan’s media conference will be held at 11 am today

ఇక అటు నిన్న విజయవాడ వైసిపి కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న 1.0 లో కార్యకర్తలకు అంత గొప్పగా ఏం చేయలేకపోయి ఉండొచ్చని అన్నారు. తనకు ప్రతి విషయంలో ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తపనపడ్డానని, అందుకే తన సమయాన్ని ప్రజల కోసమే కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. కానీ మన కార్యకర్తలని కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందుల్ని చూస్తున్నట్లు జగన్ తెలిపారు. ఈ క్రమంలోనే జగనన్న 2.0 పాలన వేరే లెవెల్ లో ఉంటుందన్నారు. 2.0 లో కార్యకర్తల కష్టాలు ఏంటో చూశానని.. చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూస్తున్నానని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version