వైఎస్ షర్మిల తన కుమారుడి పెళ్లి వీడియో వైరల్

-

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన కుమారుడి పెళ్లి వీడియోను ‘X’లో పోస్ట్ చేశారు. ఆమె కుమారుడు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో రాజస్థాన్ లోని జోద్పూర్ ప్యాలెస్ లో జరిగిన విషయం తెలిసిందే. ‘ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఒక తల్లిగా నా జీవితంలో ఇది మరో సంతోషకరమైన క్షణం’ అని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.

YS Sharmila Son Marriage At Jodhpur

కాగా, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లికి ఏపీ సీఎం జగన్ హాజరు కాకపోవడం గమనార్హం. రాజకీయంగా జగన్ పై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ రాలేదా లేక బిజీగా ఉండి వెళ్లలేదా అన్న ఆసక్తికర చర్చ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version