అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నేరుగా వారి ఖాతాల్లోకి నగదును జమ చేసిన సీఎం జగన్… మొత్తంగా 3,39,096 మంది విద్యార్థులకు రూ.137 కోట్ల నగదును బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. 2,99,085 మందికి వైయస్సార్ పెన్షన్‌కానుక వర్తింపు, కొత్త సామాజిక పెన్షన్ల వల్ల ఏటా రూ.935 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు.
కొత్తగా 7,051 మందికి బియ్యం కార్డులు ఇస్తున్నామని.. కొత్తగా 3,035 మందికి వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. అర్హత ఉండి కూడా ఏ ఒక్కరుకూడా మిస్‌కాకూడదని.. దీనికోసమే తపన, తాపత్రయం పడుతున్నాం. దీనికి ఇవాళ్టిరోజే నిదర్శనమని పేర్కొన్నారు. అధికారం అంటే ప్రజలమీద మమకారం, అధికారం అంటే అజమాయిషీ కాదని.. గతంలో వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన అర్హులందరికీ కూడా ఇవాళ వారి ఖాతాల్లో జమచేస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు కొత్తగా పెన్షన్‌కార్డులు, బియ్యంకార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని.. మరో 3.10లక్షల కుటుంబాలకు ఈ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు.