పులివెందుల ప్రజలకు భరోసా ఇస్తున్న జగన్‌

-

YSR Congress Party : పులివెందుల ప్రజలకు భరోసా ఇస్తున్నారు మాజీ సీఎం జగన్‌. వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జగన్‌ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతోంది. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

YSR Congress Party President ysjagan’s visit to Pulivendula on the second day

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని భరోసానిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version