ఏపీ ప్రజలకు శుభవార్త.. YSR మత్స్యకార భరోసా సాయం పంపిణీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఈ నెల 15వ తేదీన ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు.
ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 10,000 భృతి అందిస్తుంది. కాగా, జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు.. ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్ చేస్తారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు అని తెలిపారు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ద్వారా సమస్యలు చెబితే పరిష్కారం దొరుకుతుందని వివరించారు.. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో పాటు నేరు గా పర్యవేక్షించనున్నారు.