ఏపీవాసులకు లాక్ డౌన్ మినహాయింపులు ఇవే!

-

రెడ్ జోన్ ల వ్యవస్థ, లాక్ డౌన్ విషయంలో మినహాయింపులు అనేవి జిల్లాల స్థాయిలో కాకుండా మండలాల స్థాయిలో ఉండేలా మార్పులు చేయాలని ఇప్పటికే కేంద్రానికి విన్నవించిన జగన్ తాజాగా… ఏప్రిల్ 20 నుంచి సడలించిన లాక్ డౌన్ మినహాయింపులను ఏపీలో అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఏపీలో ఇది చాలా కీలకమైన సీజన్ కావడంతో… ఈ నిర్ణయం అందరికంటే ఎక్కువగా రైతులకు, రైతు కూలీలకు, పేదలకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు!


వివరాళ్లోకి వెళ్తే… ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులపై తీవ్రంగా చర్చించిన ఏపీ సర్కారు కొత్త మార్గదర్శకాలు జారీ చేసి… ఆ ఉత్తర్వులను అధికారులకు పంపింది. దీంతో కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల నుంచి మినహాయింపులు లభించనున్నాయి.. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు! అయితే… మినహాయింపులను ఉపయోగించుకోవడంతో పాటు మాస్కులు, భౌతికదూరం నిబంధనలు మాత్రం తప్పనిసరి చేశారు.

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ మినహాయింపులు:

* గ్రామాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు చేసుకోవచ్చు.
* అన్ని రకాల వస్తు రవాణాకు అనుమతి ఇవ్వడం జరింగి.
* ఐటీ సంస్థల్లో 50శాతం ఉద్యోగులతో పనులు చేసుకోవచ్చు.
* ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం కల్పించారు.
* వాహన మరమ్మతు కేంద్రాలు, జాతీయ రహదారి పక్కన దాబాలు నిర్వహించుకోవచ్చు.
* ఉద్యోగులను తరలించే వాహనాలకు అనుమతి దొరికింది.
* రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు మినహాయింపు
* అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలకు సడలింపు చేశారు.
* ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు ఇచ్చారు.
* ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలకు మినహాయింపు ఇచ్చారు.
* సబ్బులు తయారీ కంపెనీలు, ఔషద తయారీ సంస్థలు, మాస్కులు, బాడీ సూట్ల తయారీ సంస్థలకు మినహాయింపు లభించింది.
* కోల్డ్ స్టోరేజీలు, ఆగ్రో ఇండస్ట్రీస్, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలకు మినహాయింపు లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version