ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలోని అంగన్ వాడి పోస్ట్ఉల భర్తీకి నోటిషికేషన్ ను విడుదల చేసింది. అంగన్ వాడి కార్యకర్త మరియు అంగన్ వాడీ సహాయకురాలు అలాగే మినీ అంగన్ వాడీ కార్యకర్త తదితర విభాగాలలో ఈ పోస్టులకు సంబంధిచిన ఖాళీలు ఉన్నాయి. ఇక పదో తరగతి పాసయ్యిన వారు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిషికేషన్ ద్వారా కడప జిల్లాలో 288 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అంతే కాకుండా చిత్తూరు జిల్లాలో 484 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ నెల 31వ తేదీన దరఖాస్తులకు చివరి తేదీగా ప్రకటించారు. ఇదిలా ఉండగా మహిళలకు ఈ నోటిషికేషన్ ఎంతగానో ఉపయోగపుడుతుంది. ఉన్న ఊర్లో లేదంటే చుట్టు పక్కల గ్రామాలలోనే అంగన్వాడీ పాఠశాలలో పోస్టింగ్ ఇస్తారు. కాబ్బటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా మంచి జీతాలు కూడా ఉంటాయి.