Animal: ఇంత మోసం చేస్తావ్ అనుకోలేదు వంగా మామ….

-

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది. బాబి డియో అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం 900 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమా నిడివి ఎక్కువైనప్పటికీ దర్శకుడు ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు.

 

అయితే ఈ చిత్రం ఓటీటీ వెర్ష‌న్‌కు 20 నిమిషాలు జ‌త చేయ‌నున్న‌ట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే.ఆ కొత్త సీన్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకి చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. అదనపు సన్నివేశాలను యాడ్ చేస్తారనుకుంటే, ఓటిటీలో కూడా థియేటర్ రన్ టైమ్ తోనే రిలీజ్ చేశారు. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ వంగా మామ.. ఇంత మోసం చేస్తావనుకోలేదు.. అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version