జూబ్లీహిల్స్‌ లో మరో దారుణం..పబ్ లో యువతిపై దాడి..రేప్‌ చేస్తామని !

-

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో స్టార్ హోటల్ పబ్ లో యువతి పై దాడి చేశారు కొందరు దుండగులు. యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్న ఓ యువతిపై దాడికి దిగారు. న్యూట్రిషనిస్ట్, డైటిషన్ పై పబ్ లో బడా బాబుల పిల్లలు అసభ్య ప్రవర్తన చేశారు. రూఫ్ టాప్ పబ్ లాంజ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి పబ్ కు వెళ్ళిన బాధితురాలు.. ఆదివారం తెల్లవారుజామున పబ్ లోనే బాధితురాలి పై 8 మంది యువకులు అసభ్య ప్రవర్తన చేశారు.

ఆపేందుకు ప్రయత్నించిన స్నేహితురాళ్ళ పై బాటిల్స్ తో విచక్షణ రహితంగా దాడి చేశారు యువకులు. పబ్ లో ఉన్న సమయం లో బాధితురాలి దగరికి వచ్చి ఫోన్ నంబర్ అడిగిన నిందితులు… బాధితురాలు ఇవ్వను అని చెప్పడం తో పక్కకి తీసుకెళ్లారు అబ్రార్ , సాధ్ అనే యువకులు.

పదే పదే బాధితులతో అసభ్యంగా ప్రవర్తించిన 8 మంది యువకులు… రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అడ్డు వచ్చిన బాధితురాలి స్నేహితురాలపై మద్యం సీసాలతో దాడి చేశారు యువకులు. ఇక తాజాగా ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు పిర్యాదు చేసిన బాధితురాలు… పబ్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version