ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆయన వేసిన పిటీషన్ ను నిన్న బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు కేజీవాల్. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ని లాయర్ కలిసేందుకు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్ను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్లో కోరిన కేజీవాల్ కోరారు. అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరిస్తూ.. కేజీవాల్ పిటిషన్ ని కొట్టేసింది.
తాజాగా తన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్ విధుల నుంచి తొలగించబడ్డాడు. ప్రధానంగా అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు విజిలెన్స్ శాఖ వెల్లడించింది. దీంతో తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.